నక్సలైట్ల బీభత్సం-ఏడుగురు దుర్మరణం
ఖమ్మంః ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులో వున్నఒరిస్సా రాష్ట్రంలోని మల్కరగిరి జిల్లా లో పీపుల్స్ వార్ గ్రూప్ నక్సలైట్లు శుక్రవారం మారణహోమం సృష్టించారు. సుమారు 500 మంది నక్సలైట్లు ఆంధ,ఒరిస్సా,మహారాష్ట్ర సరిహద్దులో వున్న మల్కరగిరి జిల్లాలోని రెండు పోలీస్టేషన్లపై మెరుపుదాడి చేశారు. పోలీస్టేషన్లపై బాంబులువిసిరి బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో ఐదుగురు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. జేబులో వుంచుకున్న బాంబులు ప్రమాద వశాత్తు పేలడంతో ఇద్దరు నక్సలైట్లు కూడా ఈ దుర్ఘటనలో మరణించారు.
500 మంది సాయుధులైన నక్సలైట్లు రెండు పోలీస్టేషన్లపై మెరుపుదాడి చేశారు.పెట్రోలు, నాటు బాంబులతో బీభత్సం సృష్టించారు. పోలీస్టేషన్లలో వున్న ఇద్దరు ఎస్. ఐ.లు ముగ్గురు కానిస్టేబుళ్ళు ఈ దాడిలో దుర్మరణం పాలయ్యారు. పోలీస్టేషన్ల నుంచి నక్సలైట్లుపెద్ద ఎత్తున తుపాకులను, తూటాలను అపహరించుకొని వెళ్ళారు. ఈ దాడి సందర్భంగా నక్సలైట్లు జేబులో వుంచుకున్న బాంబులు పేలడంతో ఇద్దరు నక్సలైట్లు మరణించారు.
సుమారు నాలుగు గంటల పాటు మారణహోమం సృష్టించిన నక్సలైట్లు ఆ తరువాత సమీపంలో వున్న శబరి,సీలేరు అడవుల్లోకి వెళ్ళిపోయారు. ఒరిస్సా రాష్ట్రంలోని ఈ ప్రాంతం ఆంధ్ర ప్రదేశ్ లోని ఖమ్మం జిల్లా సరిహద్దులో వున్నాయి. ఇంతమంది నక్సలైట్లు ఒక ఆపరేషన్ లో పాల్గొనడంవిశేషంగా చెప్పుకుంటాన్నారు.












Click it and Unblock the Notifications