ఆంధ్రకు 1145కోట్ల అదనపు నిధులు
న్యూఢిల్లీః ఆంధ్ర ప్రదేశ్ వార్షిక ప్రణాళికా మొత్తం 1145 కోట్లు రూపాయల మేరకుపెరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రణాళికా పెట్టుబడిని 8,378 కోట్లు రూపాయలుగా 11వ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడుకె.సి. పంత్ శుక్రవారం నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కె.సి.పంత్ ను కలుసుకొని ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాష్ట్రం అవలంబిస్తున్న ఆర్థిక విధానాలను పంత్ ప్రశంసించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 8,900 కోట్ల రూపాయలను ప్రణాళికా పెట్టుబడిగా సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే గత ఏడాదికంటే 1145 కోట్ల రూపాయలు అదనంగా 8,378 కోట్లు రూపాయలు సాధించ గలిగింది.
9 వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యాలలో ఆంధ్ర ప్రదేశ్ ఇప్పటికే 85 శాతం లక్ష్యాలు సాధించిందని పంత్ చెప్పారు. మెరుగైన ఫలితాలు సాధించిన ఆంధ్ర ప్రదేశ్ కు వివిధ పథకాల కిందవీలైనన్ని ఎక్కువ నిధులు మంజూరు చేయాలని యోచిస్తున్నట్లు పంత్‌వివరించారు. డి.పి.ఎ.పి. పథకం కింద ఆంధ్రప్రదేశ్ కు అదనపు నిధులు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంవిద్యుత్ రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేసి ఎన్నో సంస్కరణలు చేపట్టిందని పంత్ ప్రశంసించారు.
- విద్యుత్ సంస్కరణలపై బాబుకు కితాబు












Click it and Unblock the Notifications