రుణభారం, నిరక్షరాస్యతపై హెచ్చరిక
న్యూఢిల్లీః చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి విద్యుత్ సంస్కరణలపై పొగడ్తలు... నిరక్షరాస్యత, అనవసర వ్యయాలపై తెగడ్తలు లభించాయి. 11వ ఆర్థిక సంఘం ఉపాధ్యక్షుడు కె.సి. పంత్ ఆంధ్ర ప్రదేశ్ ప్రణాళికా లక్ష్యాలు సాధించడంలో ముందుందని ప్రశంసించారు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి పలు సంస్కరణలు చేపట్టిందని ఆయన ప్రశంసించారు.
అయితేఅక్షర క్రమంలో ప్రధమ స్థానంలో వుండే ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యతవిషయంలో చెప్పుకో తగ్గ పురోగతి సాధించలేదని 11వ ప్రణాళికా సంఘం అభిప్రాయపడింది. ముఖ్యంగా పట్టణాలు- గ్రామాల మధ్యఅక్షరాస్యతా శాతంలో వున్న వ్యత్యాసం పట్ల కె.సి. పంత్ ఆందోళన వ్యక్తం చేశారు. పల్లె ప్రజలనుఅక్షరాస్యులుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం మరింత కృషి చేయాలని ఆయన సూచించారు.
అదే విధంగా ప్రభుత్వ వ్యయాన్ని అదుపు చేయకపోతే రాష్ట్రం ఆర్థికంగాసంక్షోభంలో పడే ప్రమాదం వున్నదనికె.సి. పంత్ హెచ్చరించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తామని, అనుకున్న మేరకు నిధులు సంపాదించలేక పోయినా వివిధ పథకాల కింద మరిన్ని నిధులు తెచ్చుకొనేందుకు కృషి చేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగావిలేకరులతో మాట్లాడుతూ చెప్పారు.
- ఆంధ్రకు 1145కోట్ల అదనపు నిధులు












Click it and Unblock the Notifications