నేత కార్మికుని ఆత్మహత్య
సిరిసిల్లః సిరిసిల్లకు చెందిన ఒక చేనేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు చెప్పారు. పిట్టల రాజేశం అనే పవర్‌లూమ్ కార్మికుడు గత కొద్దిరోజులుగా ఉద్యోగం, ఉపాథి లేకపోవడంతో తన కుటుంబాన్ని పస్తులుంచుతున్నట్టుగా తెలిసింది.
ప్రత్యామ్నాయ ఉపాధి సంపాదించుకోవడానికి చేసిన ప్రయత్నాలువిఫలం కావడంతో 30 ఏళ్ల రాజేశం ఆత్మహత్య చేసుకున్నారు. రాజేశంకు భార్య రెండేళ్ల కొడుకు వృద్ధులైన తల్లితండ్రులు వున్నారు. సిరిసిల్లలో గత నెల రోజులుగా పవర్‌లూమ్స్ పనిచేయకపోవడంతో ఈ లూమ్స్‌లో పనిచేసే కార్మికులు పస్తులు వుంటున్నారు. మున్సిపల్ చైర్మన్ దయతో ఇచ్చిన 500 రూపాయలతో రాజేషం అంత్యక్రియలు చేశారు.












Click it and Unblock the Notifications