వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సఖ్యతతో ప్రాజెక్టుల సాధన: బాబు
న్యూఢిల్లీః కేంద్రంతో సఖ్యతగా వుండి పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు ప్రయత్నించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీలకు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితవు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో వున్న చంద్రబాబు శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ రంగ సంస్థల డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌పై తెలుగుదేశం అనుసరించాల్సిన వైఖరిని ఈ సమావేశంలో ఖరారు చేశారు.విద్య ఉమ్మడి జాబితాలో వున్న కారణంగా విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై విధిగా రాష్ట్రాలతో కేంద్రం సంప్రదించాలని సమావేశం అభిప్రాయపడింది. కరవు సాయం కోసం కేంద్రంతో చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎంపీలు తమపద్దతిలో కొనసాగించాలని నిర్ణయించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!