సంక్షోభంలో యు.పి. సర్కార్
లక్నోః ఉత్తరప్రదేశ్ లోని రాజ్ నాథ్ సింగ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ఉత్తరప్రదేశ్ లోని బిజెప ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ పార్టీ నేత, రాష్ట్ర విద్యుత్ మంత్రి నరేష్ అగర్వాల్ కు ముఖ్యమంత్రి ఉద్వాసన పలకడంతో ఈ సంక్షోభం తలెత్తింది. దీనితో బిజెపి ప్రభుత్వం మైనారిటీలో పడిన దృష్ట్యా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీని రద్దుచేసి తాజాగా ఎన్నికలు జరిపించాలని సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
తమ ప్రభుత్వానికి మెజారిటీ వున్నదని,అసెంబ్లీ రద్దు అవసరం లేదని రాజ్ నాథ్ సింగ్ చెబుతున్నారు.సంక్షోభం నేపధ్యంలో బిజెపి గుంభనంగా వున్నప్పటికీ గండం నుంచి గట్టెక్కేందుకు మార్గాలను అన్వేషిస్తున్నది. లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ లో చీలిక తెచ్చి పబ్బం గడుపుకొనేందుకు రాజ్ నాధ్ సింగ్ ప్రయత్నిస్తున్నది.విద్యుత్ మంత్రి నరేష్ యాదవ్ కు వ్యతిరేకంగా ఇటీవలవిద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రదర్శన నిర్వహించారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీనితో ఆగ్రహించిన నరేష్ యాదవ్ బిజెపిని తీవ్రంగావిమర్శించారు.
బిజెపి పరువును బజారుకు ఈడుస్తున్న నరేష్ కు రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం ఉద్వాసన పలికారు. నరేష్‌అగర్వాల్ లేనప్పటికీ తమ మద్దతు బిజెపి సర్కార్ కు కొనసాగుతుందని లోక్ తాంత్రిక్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు మంత్రులుచెప్పారు. త్వరలో ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ లో తలెత్తిన ఈసంక్షోభం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో అని రాజకీయ పరిశీలకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications