ఉత్తరప్రదేశ్‌లో రాజకీయసంక్షోభం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. యుపి సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా వున్న లోక్‌తాంత్రిక్‌ కాంగ్రెస్‌ నేత నరేష్‌ అగర్వాల్‌ను మంత్రివర్గంలోంచి డిస్మిస్‌ చేస్తూ ముఖ్యమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీసుకున్న నిర్ణయం రాజకీయ సంక్షోభాన్ని రగిలించింది. గత కొద్ది రోజులుగా బిజెపికి లోక్‌తాంత్రిక్‌ కాంగ్రెస్‌కు మధ్య విభేదాలు రగలుతున్నాయి.

విద్యుత్‌ చార్జీలపెంపునకు నిరసనగా ఈ మధ్య బిజెపి కార్యకర్తలువిద్యుత్‌ శాఖ మంత్రిగా వున్న నరేష్‌ అగర్వాల్‌ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఈ సంఘటనపై ఆగ్రహించిన నరేష్‌ బిజెపిపై నేరుగా దాడి చేయడం ప్రారంభించారు. బిజెపి నాయకుల నుంచి అభ్యంతరాలు వచ్చినప్పటికీ లెక్కచేయకుండా ఆయన గుప్పించినవిమర్శలతో ఇరు పార్టీల మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారాయి. సంకీర్ణ మర్యాదలను, మంత్రిగా తన బాధ్యతలనుఅగర్వాల్‌ తుంగలో తొక్కారని ఆరోపిస్తూ మంత్రివర్గం నుంచి ఆయన ఉద్వాసనకు గవర్నర్‌కు తాను సిఫారసు చేసినట్టుగా రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. అయితే రాజ్‌నాథ్‌ తనను డిస్మిస్‌ చేయడమేమిటనీ తానే మంత్రివర్గానికి రాజీనామా చేశానని నరేష్‌అగర్వాల్‌ ప్రకటించారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరాల్సిన యుపిలో ఈ తాజా పరిణామాలతో ప్రభుత్వం కూలిపోయే అవకాశం వున్నదనిఅంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+