ఐదుకు పెరిగిన చెన్నయ్ మృతులు
చెన్నయ్‌ః ఆదివారం చెన్నయ్ లో జరిగిన హింసాంకాండలో మరణించిన వారి సంఖ్య ఐదుకుపెరిగింది. డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి అర్థరాత్రిఅరెస్టుకు నిరసనగా ఆదివారం చెన్నయ్ నగర మేయర్ స్టాలిన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు- డిఎంకె కార్యకర్తల మధ్యపెద్ద ఎత్తు ఘర్షణ జరిగింది. ప్రదర్శుకుల పోలీసులపై రాళ్ళు రువ్వడంతో వారు లాఠీలు ఝళిపించడంతో పాటు కాల్పులు జరిపారు.
ఈ కాల్పుల్లో ఆదివారం ముగ్గురు మరణించారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించండంతో మొత్తం మృతుల సంఖ్యం 5కుపెరిగింది. డిఎంకె ర్యాలీ సందర్భంగా జరిగిన హింసా కాండలో ఎనిమిది మంది జర్నలిస్టులతో సహా వంద మంది గాయపడ్డారు. జర్నలిస్టుల పై అమానుషంగా దాడి జరపడాన్నిసీనియర్ జర్నలిస్టులు ఖండించారు.
పెద్ద సంఖ్యలో డిఎంకె కార్యకర్తలు లాఠీఛార్జీలో గాయపడ్డప్పటికీ ఆ తరువాత మెరీనా బీచ్ వద్ద జరిగిన బహిరంగ సభకు వారు నెత్తురోడుతునేహాజరయ్యారు. ఈ బహిరంగ సభలో కరుణానిధి జయలలిత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అనంతరం గాయపడిన డిఎంకె కార్యకర్తలను కరుణానిధి పరామర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చెన్నయ్ లో ఇంకా ఉద్రిక్తత నెలకొనివుంది.
- డిఎంకె ర్యాలీలో చెలరేగిన హింస
- ఉద్రిక్తతో అట్టుడుకుతున్న చెన్నయ్
- చెన్నయ్‌హింసపై అట్టుడికిన పార్లమెంటు
- డి.ఎం.కె ఎమ్మెల్ల్యే పెరుమాళ్ మృతి












Click it and Unblock the Notifications