ఐటి సంస్థలకు విదేశీ ప్రాజెక్టులు
న్యూఢిల్లీః దేశీయ ఐటి కంపెనీలకు విదేశీ ప్రాజెక్టుల వరద మరోసారి ప్రారంభమయింది. గత కొన్ననెలలుగా విదేశీ కాంట్రాక్టులకు మొహంవాచి వున్న భారతీయ సంస్థలకు తాజా
పరిణామంతో కొత్త ప్రాణం వచ్చినట్టుగా అయింది. ముఖ్యంగా మధ్య తరహా కంపెనీలు మంచి ప్రాజెక్టులను చేజిక్కించుకుంటున్నాయి.
మాంద్యం వార్తలు మార్కెట్‌ను ముంచెత్తిన కాలంలో విదేశీ ప్రాజెక్టుల సంఖ్య తగ్గడం మాత్రమే కాకుండా వచ్చిన ప్రాజెక్టులు కేవలం బడా ఐటి కంపెనీలకే పరిమితమయ్యాయి. గత కొద్ది వారాలుగా పరిస్థితిలో మార్పు కనిపిస్తున్నదని మరోసారి ప్రాజెక్టుల విరివిగా రావడం ఆరంభమయిందని అంటున్నారు. మైండ్‌ట్రీ కన్సల్టింగ్, ఎక్సిమ్ సాఫ్ట్ వంటి పలు కంపెనీలు కొత్త ప్రాజెక్టుల వార్తను ధృవీకరించాయి.
యూరప్, అమెరికా నుంచి కాంట్రాక్టులు వస్తున్నాయని మధ్యతరహా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఔట్‌సోర్సింగ్ ఈ మధ్యనే యూరప్‌లో పాపులర్‌గా మారిందని అక్కడి కార్పొరేట్ సంస్థలు ఔట్‌సోర్సింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుండటంతో మళ్లీ తమ వ్యాపారం పెరిగిందని వారు అంటున్నారు. అయితే గతంలో లాగా మార్జిన్లు ఈ సారి ఎక్కువగా వుండే అవకాశం కన్పించడం లేదని భారతీయ సంస్థల నుంచి పోటీ దీనికి కారణమని ఎక్జిమ్‌సాఫ్ట్ నేత రామకృష్ణ అన్నారు.












Click it and Unblock the Notifications