తొలిఘట్టం పంచాయతీకిసర్వంసిద్ధం
హైదరాబాద్‌ః గ్రామపంచాయతీ ఎన్నికల తొలిఘట్టం పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తం 22 జిల్లాల్లోని 7 వేల గ్రామాల్లో మంగళవారం నాడు పోలింగ్‌జరుగుతున్నది. పోలింగ్ సిబ్బంది ఇప్పటికే గ్రామాలకు చేరుకున్నారు.
ఉద్రిక్తతలకు అవకాశం వున్న ఫాక్షనిస్టు ప్రాంతాలు, నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లోపెద్దఎత్తున పోలీసుల బలగాలను మొహరించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలనుంచి కూడా పోలీసు బృందాలను రప్పించినట్టు అధికారులు చెప్పారు. ఎన్నికలుపేరుకు పార్టీ రహితంగా జరుగుతున్నప్పటికీ దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బరిలో వున్న అభ్యర్దులంతా ఏదో ఒక పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. ఈ సారి ఎన్నికల్లో దాదాపు 10 శాతం గ్రామ పంచాయితీల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగినట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
మంగళవారం ఉదయం ఏడు గంటలనుంచి ఒంటి గంటవరకు పోలింగ్ జరుగుతుందని రెండు నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. రెవెన్యూ డివిజన్ల వారిగా ఫలితాలు సాయంత్రం వరకు వెల్లడయ్యే అవకాశం వున్నదని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications