చెన్నయ్‌ హింసపై అట్టుడికిన పార్లమెంటు

న్యూఢిల్లీః చెన్నయ్‌ హింసాకాండపై పార్లమెంటు ఉభయ సభలు సోమవారం అట్టుడికి పోయాయి. ఉభయ సభలు మంగళవారం నాటికి వాయిదా పడ్డాయి. చెన్నయ్‌ మేయర్‌ , డిఎంకె అధినేత కరుణానిధి తనయుడు స్టాలిన్‌ సారధ్యంలో ఆదివారం జరిగిన ర్యాలీ హింసాత్మకరంగా మారినవిషయం విదితమే. ఈ ర్యాలీపై పోలీసులు కాల్పులు, లాఠీఛార్జీ జరిపారు. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించారు. 8 మంది జర్నలిస్టులతో సహా వందమంది తీవ్రంగా గాయపడ్డారు.

సోమవారం లోక్‌ సభ ప్రారంభంఅయిన వెంటనే డిఎంకె సభ్యులు జయలలిత ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ గందరగోళం సృష్టించారు. డిఎంకె సభ్యుల ఆరోపణలను ఖండిస్తూ అన్నాడిఎంకె సభ్యులు కూడా రణభేరి మోగించడంతో సభా కార్యక్రమాలు స్తంభించి పోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకుస్పీకర్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీనితో మధ్యాహ్నం రెండు గంటల వరకు, ఆ తరువతా మంగళవారం వరకు సభను వాయిదా వేస్తున్నట్లుస్పీకర్‌ ప్రకటించారు.

రాజ్య సభ లో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. డి.ఎం.కె. - అన్నా డిఎంకె సభ్యుల ఆరోపణలు ప్రత్యారోపణల కారణంగా సభ మంగళవారానికి వాయిదా పడింది.

కరుణకు వాజ్‌ పేయి ఫోన్‌
డిఎంకె అధినేత కరుణానిధికి ప్రధాని వాజ్‌పేయి ఫోన్‌ చేసి తాజా పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు డిఎంకె ఎం.పి.లు ప్రధాని వాజ్‌పేయి, ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్‌ లను కలుసుకొని రాష్ట్రంలో పోలీసులు సృష్టించినఅరాచకాన్ని వివరించారు. డిఎంకె ర్యాలీపై పోలీసులు జరిపిన లాఠీఛార్జీ, కాల్పులలో ఐదుగురు మరణించినవిషయం విదితమే.

  • డిఎంకె ర్యాలీలో చెలరేగిన హింస
  • ఉద్రిక్తతో అట్టుడుకుతున్న చెన్నయ్‌
  • చెన్నయ్‌హింసపై అట్టుడికిన పార్లమెంటు
  • డి.ఎం.కె ఎమ్మెల్ల్యే పెరుమాళ్‌ మృతి
  • న్యాయవిచారణకు జయ ఆదేశం
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+