విశాఖ భూకుంభకోణంలో వెంకయ్య
విశాఖపట్నంః విశాఖపట్నం రక్షణశాఖ భూకుంభకోణంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హస్తం వున్నదని సీనియర్ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఆరోపించారు. సోమవారం నాడు ఆయన విశాఖలో వివాదాస్పదమైన భూములను సందర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంత భారీ కుంభకోణంలో ప్రభుత్వం ఇంతవరకు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోలేదనివిమర్శించారు. పత్రికల్లో వచ్చిన వార్తలతో పాటు వ్యవహారాన్ని లోతుగా పరిశీలించిన వారెవ్వరికైనా ఈ కేసులో కేంద్ర నేతల ప్రమేయం వున్నవిషయం అర్ధం అవుతుందని ఆయన చెప్పారు.
ఇదిలా వుండగా హైదరాబాద్‌లో జరిగిన వేరొకవిలేకరుల సమావేశంలో పిసిసి ప్రతినిధి రోశయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలపై సాగుతున్న అమానుష దాడులకు తెలుగుదేశం పార్టీ మద్దతు వున్నదని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఇద్దరు,శ్రీకాకుళం జిల్లాలో ఒక్కరు ఈ మధ్య జరిగిన స్థానిక ఎన్నికల్లోవిజయం సాధించిన కాంగ్రెస్ నేతలను బలితీసుకున్నారని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీవారిపై హత్యాకాండకు తెలుగుదేశం మద్దతు దారులు పాల్పడుతున్నట్టుగా ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications