సిమిపై నిషేధానికి కేంద్రం యోచన
లక్నోః స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)ని నిషేధించే విషయం ప్రభుత్వ పరిశీలనలో వుంది. ఈ విషయం కేంద్ర హోం మంత్రి ఎల్‌కె అద్వానీ చెప్పారు.
జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా సిమిపై నిషేధం విధించాలని కేంద్రం యోచిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌తో సహా వివిధ రాష్ట్రాలనుంచి సిమిని నిషేధించాల్సిందిగా విజ్ఞప్తులు అందాయని ఆయన చెప్పారు. సిమి కార్యకలాపాలపై వివిధ రాష్ట్రాలనుంచే కాకుండా కేంద్ర ఇంటలీజెన్స్ సంస్థనుంచి కూడా తమకు అందిన నివేదికలు సంస్థకు ప్రమాదకరమైన విద్రోహ కార్యకలాపాలతో సంబంధం వున్న విషయం స్పష్టం చేస్తున్నదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications