హరికృష్ణపై బాబు వరాల జల్లు
హైదరాబాద్‌ః కామన్ వెల్త్ ఛాంపియన్ షిప్ పోటీల్లోస్వర్ణపతకాన్ని సాధించి తెలుగుతేజం హరికృష్ణ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్‌ఆర్. రంగరాజన్ ను కలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు హరికృష్ణను అభినందనలతో ముంచెత్తారు. తెలుగువారి ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా చాటిన హరికృష్ణను దుశ్శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. హరికృష్ణకు హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవడానికి స్థలం, ఇంటి నిర్మాణానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయంఅందజేస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.
హరికృష్ణకుఅత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు అయ్యే ఖర్చునుకూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయనచెప్పారు. ఇక మీదట హరికృష్ణ ఏ పోటీలో పాల్గొంటున్నాఅందుకు అయ్యే ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమేఇస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అనంతరంహరికృష్ణ తన తల్లిదండ్రులు, తాతతోపాటు గవర్నర్ రంగరాజన్ ను కలుసుకున్నారు. హరికృష్ణభవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలనిరంగరాజన్ ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications