కరవుపై యుద్ధభేరిః చంద్రబాబు

హైదరాబాద్‌ః కరవుపై సత్వర చర్యలు తీసుకొనేందుకు తక్షణం 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించింది. కరవుపై యుద్ధభేరి మోగించాలని, ఏలేరు కుంభకోణంపై తిరిగివిచారణ జరపాల్సిన అవసరం లేదని రాష్ట్ర క్యాబినెట్‌ అభిప్రాయపడింది. కరవు నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ఇటీవలస్వల్పంగా వర్షాలు కురిసినప్పటికీ కరవు బారిన పడిన జిల్లాలలకు అవి పూర్తి స్థాయి ఊరటను ఇచ్చే అవకాశం కనిపించలేదని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. సాధారణ వర్షపాతం కంటే 24 శాతం తక్కువ వర్షాలు కురిశాయని ఆయన చెప్పారు. జలాశయాలు వట్టిపోతున్నాయన్నారు.

క్యాబినెట్‌ సమావేశంవివరాలను చంద్రబాబు నాయుడు విలేకరులకువివరించారు. కరవు సాయంపై కేంద్ర ప్రభుత్వం ఈ వారంలో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. కరవు బారిన పడిన ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 165 కోట్ల రూపాయల ఖర్చు చేసిందన్నారు. కరవు నివారణకు గాను పనికి ఆహార పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ఆయనవివరించారు. ఏలేరు కుంభకోణంపై నాలుగేళ్ళుగా చట్టపరంగా పలు చర్యలు తీసుకున్నామని, ఈఅంశంపై తిరిగి విచారణ జరిపించాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

ఇప్పటికి 8 జిల్లాల్లో ఉర్దూ రెండో భాషగా అమలులో వుండగా ఇకమీదట మరో ఐదు జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా అమలు చేస్తారు. రంగారెడ్డి, చిత్తూరు, మహబూబ్‌ నగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఇకమీదట ఉర్దూ రెండో భాషగా అమలవుతుంది. ఈ నెల 13 నుంచిఅసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదే విధంగా సింగరేణి కాలరీస్‌ లో 6 బ్లాక్‌ లను ప్రైవేటీకరించేందుకు రాష్ట్ర మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+