కక్షలతో రగిలిన కంకలగుంట
గుంటూరుః గుంటూరు జిల్లా కంకలగుంట గ్రామం సోమవారం అగ్నిగుండంగా మారింది. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ వర్గాలు పరస్పరం బాంబులువిసురుకోవడంతో నకిరేకల్ మండలం కంకలగుంట గ్రామం దద్దరిల్లిపోయింది. ఘర్షణలను నివారించేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్ చివరకు నామమాత్రంగా మారింది. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి రెండు గంటల పాటు ఇరు వర్గాలు దాడులకు దిగడంతో కంకలగుంట నిప్పుల కుంపటిగా మారింది.
ఈ ఘర్షణల్లో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వందలాది బాంబులువిసురుకున్నారు. 15 ఇళ్ళు దగ్ధమయ్యాయి. పలు ఇళ్ళు లూటీ అయ్యాయి. వందలాది గడ్డివాములు పరశురామప్రీతి అయ్యాయి. తెల్లవారు జామున ఇరు పార్టీలకు చెందిన నేతలు ప్రత్యర్థుల ఇళ్ళపై విరుచుపడి బీభత్సం సృష్టించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 15 మంది ఎస్.ఐ. లు 150 మంది పోలీసులు రంగంలోకి దిగారు.












Click it and Unblock the Notifications
