అన్నపూర్ణ ఒడిలోఆకలి చావులా?
న్యూఢిల్లీఃఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తో పాటు 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత రాష్ట్రాలలో నానాటికీపెరిగిపోతున్న ఆకలి చావులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు ఆకలి చావులుపెరిగిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా చూస్తూఊరుకుంటున్నాయని సుప్రీంకోర్టు విమర్శించింది. దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారిని రాష్ట్రాలు ఇంతవరకు గుర్తించక పోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆకలి చావులుఅరికట్టేందుకు ఉమ్మడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
15 రోజుల్లోగా దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారిని గుర్తించడంతో పాటు వారికి ఉచిత బియ్యం పంపిణీ పథకం కింద బియ్యం అందేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. పౌరహక్కుల సంఘాలు దాఖలు చేసిన ప్రజాప్రయోజనాలపిటిషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు 16 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ప్రజలకు ఉచితంగా ఆహారధాన్యాలు సరఫరా చేయడం సాధ్యం కాకపోయినప్పటికీ దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారు ఆకలి చావులు చస్తుంటే ప్రభుత్వాలు మౌనంగా వుండడం దారుణం అని సుప్రీంవిమర్శించింది. దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారిని గుర్తించేందుకు తీసుకుంటున్న చర్యలపై వారంలోగావివరణ ఇవ్వాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. ఎఫ్.సి.ఐ. గోడౌన్లలో బియ్యం ముక్కిపోతుంటే మరో వైపు ఆకలి చావులు జరగడంలోఅర్థం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.












Click it and Unblock the Notifications
