పరోక్ష యుద్ధం చేస్తున్న పాకిస్తాన్
న్యూఢిల్లీః భారతదేశంలో మారణహోమం సృష్టించి పబ్బం గడుపుకొనేందుకు పాక్ పరోక్ష యుద్ధం చేస్తున్నదని కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ అన్నారు. వివిధ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల పాల్గొన్న సదస్సులో బుధవారం
ఆయన మాట్లాడారు. తీవ్రవాదాన్ని కూకటివేళ్ళతో సహా నిర్మూలించనప్పుడే దేశం అభివృద్ధి సాధించగలుగుతుందని ఆయన అన్నారు.
తీవ్రవాదంపై పోరు సాగించేందుకు పోలీసులంతా కృతనిశ్చయంతో కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పలు రాష్ట్రల పోలీసులకు అత్యంత అధునాతన ఆయుధాలనుఅందజేస్తున్నట్లు అద్వానీ ఈ సందర్భంగా వెల్లడించారు. తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు కృషి చేసిన వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులను అద్వానీ ఈ సందర్భంగా సత్కరించారు.
తీవ్రవాదంపై పోరుసాగించేసైనికదళాలకు నైతిక మద్దతు ఇవ్వాల్సిన అవసరం వుందని అద్వానీ అభిప్రాయపడ్డారు. తప్పని సరి పరిస్థితుల్లో చట్టం పరిధిని అతిక్రమించినసైనికులకు మద్దతు ఇచ్చేందుకు అవసరమైతే చట్టాల్లో మార్పులు చేస్తామని అద్వానీ అన్నారు. ఇందుకోసం లా కమిషన్, న్యాయమంత్రిత్వ శాఖతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని ఆయనవివరించారు.












Click it and Unblock the Notifications