ఏలేరుపై కాంగ్రెస్ ధర్నా- ఉద్రిక్తత
హైదరాబాద్: ఏలేరు కుంభకోణంపై సోమశేఖర కమిషన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ బుధవారం రాష్ట్ర సచివాయలం ఎదుట నిర్వహించిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల కన్ను గప్పి కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాయలం ద్వారం వద్దకు చేరుకుని ధర్నా ప్రారంభించారు.
దీంతో పోలీసులు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ(సిఎల్‌పి) మాజీ నాయకుడు పి. జనార్దన్ రెడ్డిని, సిఎల్‌పి కార్యదర్శిఎం.వి. మైసురెడ్డిని, తదితరులను పోలీసులుఅరెస్టు చేశారు. ధర్నా చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జీ కూడా చేశారు. ఏలేరు కుంభకోణంలోని దోషులను శిక్షించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాత్ర వున్నదని జనార్దన్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications