జయను అనర్హురాలిగా ప్రకటిస్తే.....
న్యూఢిల్లీః తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత నియామకం చెల్లదని ప్రకటిస్తే ఆతరువాత తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరిస్తారని అటార్నీ జనరల్ సోలి సొరాబ్జీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగరాదని ఒకవేళ తీర్పు చెబితే ఆమెతో పాటు ఆమె నియమించిన మంత్రులు కూడా ఇంటిదారి పట్టాల్సిందేనా అని సుప్రీంకోర్టు సొరాబ్జీని నిలదీసింది. శిక్ష పడిన జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగడం చట్టవిరుద్ధంఅంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ బరూచా సారధ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంవిచారణ జరుపుతున్న విషయం విదితమే.
శిక్షపడిన వ్యక్తి మంత్రిగా కొనసాగేవీలులేదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నదని, అటువంటప్పుడు జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగరాదని సోలి సొరాబ్జీ ధర్మాసనానికి నివేదించారు. జయలలిత ముఖ్యమంత్రిగా కొనసాగరాదని తీర్పు చెబితే తమిళనాడు ప్రభుత్వం పరిస్థితి ఏమిటని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వం సాఫీగా నడవడానికి ఏ చర్యలు తీసుకుంటారని కూడా న్యాయమూర్తులు అడిగారు. ఈఅంశాలపై బదులిచ్చేందుకు కొంత గడువు కావాలని సోలి సొరాబ్జీ ధర్మాసనాన్నికోరారు.
- సుప్రీంకోర్టులో జయకు చుక్కెదురు
- సుప్రీంను ఆశ్రయించిన జయలలిత












Click it and Unblock the Notifications