కాంగ్రెస్ నోట జ్యోతిషం మాట
న్యూఢిల్లీః జ్యోతిషాన్నివిశ్వవిద్యాలయాల్లో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ పార్టీ సమర్థించింది.విద్య కాషాయీకరణలో భాగంగా జ్యోతిషాన్ని విశ్వవిద్యాలయాల్లోకోర్సుగా ప్రవేశపెడుతున్నారని నిన్నటి వరకు వాదించిన కాంగ్రెస్ ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవడంవిశేషం. జ్యోతిషం కూడా శాస్త్రమేనని, దానిని ఎవరైనా చదువుకోవచ్చునని కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ బుధవారం కొత్త ఢిల్లీలో అన్నారు.
విద్యను కాషాయీకరించడాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని జ్యోతిషాన్నికోర్సుగా ప్రవేశపెట్టడంపై అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్ వైఖరిలో వచ్చిన ఈ మార్పు వామపక్ష పార్టీలతో సహా పలువిపక్షాలలో విస్మయం కలిగించింది.
జ్యోతిషం కోర్సుకుదిగ్విజయ్ ఓ.కె.
విశ్వవిద్యాలయ్యాల్లో జ్యోతిషాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సమర్థించి సంచలనం సృష్టించారు. బిజెపిలో కొందరు, ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ ఈ ప్రతిపాదనను సమర్థించడంవిశేషం.
జ్యోతిషంఅసలు శాస్త్రమా కాదా అని వాదులాడుకుంటుండగా, అది శాస్త్రమేనని, జ్యోతిషాన్ని పాఠ్యాంశంగా పెట్టడంలో తప్పులేదని స్టార్ న్యూస్ తో మాట్లాడుతూ దిగ్విజయం సింగ్ చెప్పారు. వేద జ్యోతిషాన్ని,అందుకు అవసరమైన లెక్కలను నేర్పేందుకువిశ్వవిద్యాలయాల్లో కోర్సులు ప్రారంభించడం వల్ల తప్పు లేదన్నారు. అనాదిగా వున్న జ్యోతిషాన్ని పాఠ్యాంశంగా చేర్చడాన్నివిద్య కాషాయీకరణగా పేర్కొనడం అర్థంలేనిదని సమాచారం శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ కేరళలోని అలవులో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.
ఈ నెల 2న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సారధ్యంలో జరిగిన వివిధ రాష్ట్రాల సి.ఎం.ల సమావేశంలోవిద్య కాషాయీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. జ్యోతిషాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే వ్యవహారంపైపెను దుమారం చెలరేగుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను సమర్థించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.












Click it and Unblock the Notifications