6 నుంచి రెవెన్యూ సిబ్బంది సమ్మె
హైదరాబాద్‌ః రెవెన్యూ సిబ్బందిపై జరుగుతున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా 6వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె జరపాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రకటించింది.విశాఖపట్నం, నల్లొండ జిల్లాలలో రెవెన్యూ సిబ్బందిని పై అధికారులు కక్ష కట్టి వేధిస్తున్నారని రెవెన్యూ సిబ్బంది సంఘం బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. పై అధికారులు చేసిన తప్పులకు కొందరు రెవెన్యూ సిబ్బందిని సస్పెండ్ చేశారని, ఈ సస్పెన్షన్లను తక్షణం ఎత్తి వేయాలని సిబ్బందికోరారు. ఈ సస్పెన్షన్లను ఉపసంహరించుకోనంత వరకు సమ్మె కొనసాగిస్తామని సంఘం హెచ్చరించింది.
అయితే రెవెన్యూ సిబ్బందిపై వున్న కేసుల పరిష్కారానికి కొంత సమయం కావాలని రెవెన్యూ శాఖ మంత్రిఅశోక గజపతి రాజు అన్నారు. సిబ్బంది ఇలా ఆకస్మకంగా సమ్మెకు దిగడం సమంజసం కాదని, సమ్మె ఆలోచనవిరమించుకోవాలని ఆయన హితవు పలికారు.












Click it and Unblock the Notifications