సింగరేణి ప్రైవేటు పై నిరసన హోరు
ఆదిలాబాద్‌ః సింగరేణి కాలరీస్ లో కొన్ని బ్లాకులను ప్రైవేటీకరించాలనే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం పెను వివాదానికి దారితీస్తున్నది.ప్రైవేటీకరణ యత్నాలకు వ్యతిరేకంగా లక్ష సంతకాలసేకరణ ప్రారంభిస్తున్నట్లు సిఐటియు, సింగరేణి కార్మిక సంఘం బుధవారం హైదరాబాద్ లో ప్రకటించింది. ప్రైవేటీకరణకు తెలుగుదేశం ప్రభుత్వంస్వస్తి చెప్పేంత వరకు నిరవధిక పోరాటం చేస్తామని సింగరేణి ఎంప్లాయిస్ సంఘం అధ్యక్షుడు రాజారావు హెచ్చరించారు.నష్టాల్లోనడుస్తున్న సింగరేణి కాలరీస్ ను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం నాంది పలికిందని కార్మిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే కార్మికులకు ఎటువంటి నష్టం వుండదని సింగరేణి యాజమాన్యం నమ్మపలుకుతున్నది.
సింగరేణి కాలరీస్ లో ఖర్చు అధికంగా వుండి, ఆదాయం తక్కువగా వున్న 11 బ్లాకులను యాజమాన్యం గుర్తించింది.వీటిలో ఆరు బ్లాకులను ప్రైవేటు పార్టీలకు అప్పగించి అభివృద్ధి చేయించేందుకు ప్రభుత్వం రెండు రోజుల కిందట జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది.
సింగరేణి ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నదని, కొన్ని బ్లాకులను ప్రైవేటీకరించడం ద్వారా సంస్థను అభివృద్ధి పథంలో నడిపేవీలుంటుందని యాజమాన్యం చెబుతున్నది. అయితే సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం పన్నాగం పన్నుతున్నదని కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి.












Click it and Unblock the Notifications