విద్య కాషాయీకరణ సహించంః బాబు
హైదరాబాద్‌ఃవిద్య కాషాయీకరణను తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కుల, మతాలను పాఠ్యాంశాలుగా చేర్చితేవిద్యార్ధులు అయోమయంలో పడతారని, వారి భవిష్యత్తు దెబ్బతింటుందని గురుపూజోత్సవం సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగావిద్యా విధానంలో పెను మార్పులు జరగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
టీచర్స్ డే సందర్భంగా 134 మంది ఉత్తమ ఉపాధ్యాయులను చంద్రబాబు నాయుడు సత్కరించారు.విద్యార్థులను ఆదర్శంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత అధ్యాపకులదేనని ఆయన చెప్పారు. ప్రాధమికవిద్యను పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి వున్నదని ఆయన అన్నారు. బడికి వెళ్ళాల్సిన వయసులో విధిలేక పనులకు వెళుతున్న వారిని తిరిగి పాఠశాలలకు రప్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నదని ఆయన చెప్పారు.
హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గురుపూజోత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధవిశ్వవిద్యాలయాల్లో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ను స్మరించుకొని నివాళులుఅర్పించారు. ఆయన వి.సిగా పనిచేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications