మహిళలకు సారీ చెప్పిన చంద్రబాబు
హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఅక్షరాస్యతా ఉద్యమ కార్యకర్తలకు శనివారం క్షమాపణలు చెప్పారు.అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా అక్షరాస్యతా కార్యకర్తలను అధికారులుపెద్దసంఖ్యలో హైదరాబాద్ కు తరలించారు.అక్షరాస్యతా దినోత్సవం సదస్సు జరుగుతున్న రవీంద్రభారతిలో స్థలం చాలకపోవడంతో వందలాది మహిళలను పోలీసులు లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. దీనితో గ్రామాలనుంచి వచ్చిన ఆ మహిళలు పాటలు పాడుతూ తమ నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రానుండడంతో అనవసరమైన గొడవ వద్దంటూ పోలీసులు ఆ మహిళలను ప్రాధేయ పడ్డారు. గ్రామాల నుంచి మమ్మల్ని అనవసరంగా ఇక్కడకు తరలించారని, కార్యక్రమంలో పాల్గొనేందుకు తీసుకువచ్చి ఇలా ఎండలో నిలుచోపెడతారా అని వారు పోలీసులను నిలదీశారు.
చంద్రబాబు కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళుతున్న సమయంలో ఆ మహిళలు ధర్నా చేశారు. వారి వద్దకు వెళ్ళిన చంద్రబాబుఅసలు విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. లోపల స్థలం లేని కారణంగామిమ్మల్ని లోపలకు రానివ్వకపోయి వుండవచ్చని చంద్రబాబు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అధికారుల తరపునమీ అందరికీ నేను క్షమాపణ చెబుతున్నానని బాబు అనడంతో ఆ మహిళలు కరతాళ ధ్వనులు చేస్తూ చంద్రబాబుకు జైఅంటూ నినదించారు.
మహిళలను ఇబ్బందులు పాలు చేసిన అధికారుల గురించి ఆరా తీయాల్సిందిగా చంద్రబాబు నాయుడా ఆ తరువాత తన సిబ్బందినిఆదేశించారు.- నాలుగేళ్లలో సంపూర్ణ అక్షరాస్యత
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!