ఆంధ్రకు కేంద్ర సాయంకరవు!

న్యూఢిల్లీః తీవ్రమైన కరవుతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌ కు కేంద్ర ప్రభుత్వం దాదాపు మొండి చేయి చూపింది. ఆంధ్రప్రదేశ్‌ లో కరవు ఛాయలు పెద్దగా లేవని నాలుగురోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి వెళ్ళిన కేంద్రబృందం నివేదిక ఇవ్వడంతో కేంద్రం మరింత బిగుసుకుపోయింది. జాతీయ విపత్తు సహాయ నిధిలో డబ్బులేదని, ఒరిస్సా, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాలుకేంద్ర నుంచి అధిక మొత్తంలో డబ్బు ఆశిస్తున్నందు వల్ల భారీ మొత్తంలో సాయం ఆశిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ కు నిధులు ఇవ్వలేమని కేంద్రం దాదాపు తేల్చి చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన కరవు లెక్కలకు, కేంద్రం రూపొందించిన లెక్కలకు పొంతనకుదరక పోవడం కూడా కేంద్రం నుంచి కరవు సాయం రాకపోవడానికి కారణంగా భావిస్తున్నారు. జాతీయ విపత్తు సహాయ నిధిలో డబ్బు లేకపోతే గతంలో వేరే పద్దుల కింద డబ్బు మంజూరు చేసేవారు. ఈ సారి ఆలా కూడా చేయకుండా ప్రకృతి వైపరీత్యాల నిధిలో వున్నడబ్బు ఖర్చుచేసుకోండని ఉచిత సలహా ఇచ్చింది. ప్రకృతి వైపరీత్యాల నిధికింద కేంద్రం 207 కోట్లు కేటాయించింది. ఇందులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 117 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంకా 90 కోట్ల రూపాయలు వున్నాయి. అవికూడా ఖర్చయ్యాక చూద్దాంఅంటూ కరవు సాయంపై కేంద్రం మొండి చేయి చూపింది.

ఆ కాస్త నిధులు కూడా ఇప్పుడే ఖర్చు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలోనిమిగిలిన నెలలను ఎలా నెట్టుకు రావాలని రాష్ట్ర అధికార యంత్రాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఢిల్లీ నుంచి కరవు పరిశీలనకు ఓ బృందాన్నిపంపి, నానా హంగామా చేసి చివరకు మొండి చేయి చూపడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహంతో వున్నారని తెలుస్తున్నది. రాజకీయ ఒత్తిడి ద్వారా మాత్రమే కరవు బాధలు పట్టని కేంద్రాన్ని దారికి తెచ్చేందుకు చంద్రబాబు వ్యూహం రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+