విజయవాడలో లాయర్ల పత్రిక
విజయవాడః ఆంధ్రప్రదేశ్ లో మరో హైకోర్టు బెంచి ఏర్పాటు చేసేవిషయాన్ని పరిశీలిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సత్యబ్రత సిన్హా హామీ ఇచ్చారు. సోమవారంవిజయవాడ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.విజయవాడ బార్ అసోసియేషన్ సంపాదకత్వంలో నడిచే న్యాయవిజ్ఞాన పక్షపత్రిక ధర్మకాండను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ హైకోర్టు బెంచి ఏర్పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిథిలోకి వచ్చేఅంశమని అయితే అనుకూలమైన ప్రదేశాన్ని సూచిస్తే ప్రభుత్వాలతో మాట్లాడి బెంచ్ ఏర్పాటు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు.విజయవాడ లేదా గుంటూరులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేయాల్సిందిగా గతంలో కోస్తా ప్రాంతం న్యాయవాదుల సంఘాలుపెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయి. అయితే వారి ఆందోళన సత్ఫలితాలను ఇవ్వలేదు. సత్యబ్రత సిన్హా హామీతో తిరిగి న్యాయవాదులు హైకోర్టు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు కోసం ఉద్యమించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications