వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్‌ జాబ్‌... ఆంధ్రలోహాట్‌ కేక్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః పోలీసు ఉద్యోగాలకోసం ఆంధ్రప్రదేశ్‌ లోని నిరుద్యోగ యువత ప్రాణాలకు తెగించి పరుగులు తీస్తున్నది. ఆదివారం నుంచి వివిధ జిల్లా కేంద్రాల్లో ప్రారంభమైన పోలీసు రిక్రూట్‌ మెంట్‌ లక్షలాది నిరుద్యోగులకు ఆశాజ్యోతిగా మారింది. హైదరాబాద్‌ లో 72 కానిస్టేబుల్‌ పోస్టులు ఖాళీ వుండగా ఇందుకోసం 11వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారంటే పోలీసు పోస్టులకు ఎంత డిమాండ్‌ వున్నదో, రాష్ట్రంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా వుందోఅర్థం చేసుకోవచ్చు.

గుంటూరులో జరుగుతున్న పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ కు ఆరువేల మంది అభ్యర్థులుహాజరయ్యారు. ఇంటర్య్వూలు లేకపోవడం, దేహదారుఢ్య పరీక్షలే అభ్యర్థుల ఎంపికకు ప్రాతిపదిక కావడంతో ఈ ఉద్యోగాలపై యువత కొండంత ఆశపెట్టుకుంది. విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, తిరుపతి, హైదరాబాద్‌ తదితర కేంద్రాలలో ఆదివారం నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులకు అధికారులుపెట్టే పరీక్షలు చాలా కఠినంగా వుండడంతో కొందరు అభ్యర్థులు సొమ్మసిల్లి పడి పోతున్నారు.విజయనగరం జిల్లాలో ఓ అభ్యర్థి పరుగుపందెంలో ప్రాణాలు విడవడం అత్యంతవిషాదకరం.

5 కిలోమీటర్ల పరుగు..........
మండుటెండలో 5 కిలోమీటర్ల దూరం పరుగు పెట్టడం, ఆ తరువాత హై జంప్‌, లాంగ్‌ జంప్‌ లంటూ అధికారులు యువతను నానా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. పోలీసు కానిస్టేబుల్‌ గా చేరిన తరువాత సంగతి దేవుడెరుగు..... అధికారులు పెడుతున్న ఈ పరీక్షలను తట్టుకోవడమే కష్టంగా వున్నదంటూ కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. అయితే ఎన్ని కష్టాలనైనా భరించి పోలీసు కావలన్నదే తమ లక్ష్యమని కొందరు యువకులు చెబుతున్నారు.

నిరుద్యోగం విశ్వరూపం...........
టీచర్‌ పోస్టులుమినహా మరే ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో వుంది. ఈ తరుణంలో వందలాది కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ పడడం,పైగా నేరుగా ఎంపిక జరిగే అవకాశం వుండడంతో పిజిలు, డాక్టరేట్‌ లు చేసిన వ్యక్తులు కూడా పరుగు పందాల్లో పాల్గొంటున్నారు.

మహిళా అభ్యర్థినుల జోరు......
కానిస్టేబుల్‌, ఎ.ఎస్‌.ఐ. పోస్టులలో సుమారు 150 పోస్టులు మహిళలకు రిజర్వు చేయడంతో వందలాది మంది యువతులు పరీక్షలకుహాజరయ్యారు. మహిళా పోస్టులకు కూడా ఒక పోస్టుకు వంద దరఖాస్తులు రావడం అధికారులను ఆశ్చర్య పరచింది. అన్నింటికంటే హైదరాబాద్‌ లో వున్న 72 పోస్టులకు 11వేల దరఖాస్తులు రావడం రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రతకు అద్దం పడుతున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X