ద్రవిడ మోడల్ 2.0 లోడింగ్..: డీఎంకే వార్ రూమ్: కౌంట్ డౌన్ షురూ

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపునకు గడువు సమీపించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో ఈ నెల 4న కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ఇదివరకే వెల్లడైన నేపథ్యంలో వీటిపైనే అందరి చూపూ నిలిచింది. ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో ఆయా పార్టీలన్నీ కూడా వరుస సమావేశాలను నిర్వహిస్తోన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య డీఎంకే, ఏఐఏడీఎంకే వార్ రూమ్‌లను యాక్టివేట్ చేశాయి. కౌంటింగ్ రోజు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి, ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనడానికి సన్నాహాలు ముమ్మరం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, 62 కౌంటింగ్ కేంద్రాలను సమన్వయం చేసుకునేలా ఇవి ఏర్పాటయ్యాయి. నియోజవర్గ పార్టీ కార్యాలయంతో వీటిని అనుసంధానించారు. క్షేత్రస్థాయిలో కమ్యూనికేషన్, సూపర్ వైజింగ్ సిస్టమ్ ల బలోపేతం చేసుకున్నాయి.

DMK Sets Up Countdown Screen in Chennai Party Office for Dravida Model 2 0 Ahead of Counting Day

62 కౌంటింగ్ కేంద్రాలలో అభ్యర్థులు, ఏజెంట్లు, జిల్లా అధికారులతో నిరంతర సమన్వయానికి కేంద్రీకృత నియంత్రణ వ్యవస్థలు నెలకొన్నాయి. ఈ వార్ రూమ్‌లు రియల్ టైమ్ డేటాను సేకరిస్తాయి. వాటిని నియోజకవర్గ పార్టీ కేంద్రాలకు చేరవేస్తాయి. కౌంటింగ్ కేంద్రాల్లో ఏదైనా సమస్య వస్తే, అభ్యర్థులు, ఏజెంట్లు వెంటనే వార్ రూమ్‌కు తెలిపితే తక్షణ సహాయం పొందగలరని డీఎంకే సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. ప్రతి ఓటును లెక్కించి, ఎలాంటి అక్రమాలను తావు లేకుండా పరిష్కరించేలా ఈ వార్ రూమ్ పని చేస్తుందని తెలిపారు.

డీఎంకే వార్ రూమ్ వద్ద కౌంట్ డౌన్ టైమర్ ఏర్పాటైంది. ద్రవిడ మోడల్ 2.0 అనే అక్షరాలు కనిపించాయి వాటిపై పార్టీ ఎన్నికల గుర్తయిన ఉదయించే సూర్యుడిని ముద్రించారు. రాష్ట్రానికి దిశా నిర్దేశం చేసేలా ఉన్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఫొటోను దీనిపై ప్రింట్ చేశాయి. అదే సమయంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగేలా, రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతలను పర్యవేక్షించేలా చూడాలని కోరుతూ డీఎంకే.. ఎన్నికల ప్రధానాధికారి అర్చన పట్నాయక్‌కు లేఖ రాశారు.

Take a Poll

బీజేపీ, ఇతర పార్టీలు ఓట్ల లెక్కింపునకు అంతరాయం కలిగించడానికి, కౌంటింగ్ సెంటర్లల్లో గందరగోళ పరిస్థితులు రేకెత్తించి, ఓట్లను తారుమారు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాయని తమకు విశ్వసనీయ సమాచారం అందిందని. అందుకే గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+