అమెరికాలోటెర్రరిస్టుల బీభత్సం
న్యూయార్క్‌ఃఅమెరికాలో టెర్రరిస్టులు బీభత్సంసృష్టించారు. పేలుళ్లు, విమానాల హైజాక్,కూల్చివేతతో అమెరికా నగరాలు దద్దరిల్లాయి.న్యూయార్క్‌లో ప్రపంచవాణిజ్య సంస్థభవనాలపై రెండు విమానాలను ఉగ్రవాదులుకూల్చివేయడంతో ఈ రెండు భవనాలు నేలమట్టమయ్యాయి.మరో విమానం అమెరికా రక్షణ బలగాలప్రధాన స్థావరం పెంటగాన్‌పై కూలింది. పెంటగాన్‌లోరెండు భారీ పేలుళ్లు సంభవించినట్టుగా వార్తలువచ్చాయి. వాషింగ్టన్‌లోని ఒక వాణిజ్యకేంద్రంలో పేలుడు దానిని వెన్నంటి అగ్నిప్రమాదంకూడా జరిగింది. దేశవ్యాప్తంగా కనీసం ఎనిమిది విమానాలుహైజాక్ అయినట్టుగా వార్తలు వచ్చాయి.
ఉగ్రవాదులచర్యలతో ముందు జాగ్రత్త చర్యగా వైట్‌హౌస్‌ను,స్టేట్ డిపార్ట్‌మెంట్ భవనాన్ని, కాంగ్రెస్‌ను,ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన్ని వెంటనేఖాళీ చేయించారు. వివిధ నగరాల్లోనిప్రభుత్వ కార్యాలయాలు కూడా ఖాళీచేయించారు. ఫ్లోరిడా పర్యటనలో వున్నఅధ్యక్షుడు జార్జ్ బుష్ టెలివిజన్‌లో అమెరికన్‌ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇదిటెర్రరిస్టుల చర్యనే అని ఆయనప్రకటించారు. ప్రభుత్వం ఈ దుశ్చర్యలనుసహించదని బాధ్యులను కఠినంగాశిక్షిస్తుందని ఆయన చెప్పారు.
మంగళవారం నాడు ఉదయం మొదట ఒక విమానంప్రపంచ వాణిజ్య సంస్థ భవనంపైకుప్పకూలినట్టుగా చెబుతున్నారు. ఆ తర్వాత 18నిమిషాల్లో మరో విమానం అవే భవనాలపైకూలింది. ఈ రెండు భపనాల్లో సుమారు 50 వేలమంది పనిచేస్తున్నారు. ఈ సంఘటనల దరిమిలాదేశవ్యాప్తంగా విమానాశ్రయాలను, రేవులనుమూసివేశారు. ఈ దాడులను ప్రపంచ దేశాలుతీవ్రంగా ఖండించాయి.












Click it and Unblock the Notifications