అనంతలో ముగ్గురు రైతుల ఆత్మహత్య
అనంతపురంః రాష్ట్రంలో నెలకొన్ని తీవ్ర కరవు పరిస్థితి ముగ్గురు రైతులను బలితీసుకుంది. అనంతపురం జిల్లాలో సోమవారం నాడు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనగానపల్లికి చెందిన ముత్యాలప్ప అనే రైతు నాలుగేళ్ళుగా వేరుశనగ పంట చేతికి రాకపోవడంతో పీకలలోతు అప్పుల్లో కూరుకుపోయాడు.
ఈ ఏడాది కరవు తీవ్రంగా వుండడంతో పాటుఅప్పులు తీర్చాల్సిందిగా ఒత్తిడి పెరగడంతో ఆయన భార్య లక్ష్మీనారాయణమ్మ పొలానికి వెళ్ళివిషం తాగింది. అక్కడే పనిచేసుకుంటున్న తన కొడుకు కూడావిషం ఇచ్చింది. ఈ దుర్ఘటనలో తల్లీ కొడుకులు ఇద్దరూ మరణించారు. అనంతపురం సమీపంలోని చిన్నంపల్లికి చెందిన తిమ్మన్న అనే 65 ఏళ్ళ రైతు కరవు తీవ్రంగా వుండడంతోఅప్పులు తీర్చే దారి లేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకన్నాడు.
అనంతపురం జిల్లాలో గత వారం రోజులలో కరవు బారిన పడి ఆత్మహత్య వారి సంఖ్య ఐదుకు చేరింది.












Click it and Unblock the Notifications