ఇక ఏటా రెండుసార్లే జన్మభూమి
హైదరాబాద్‌ః గాడితప్పుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఓ దారికి తీసుకురావడంతో పాటు పంచాయతీ రాజ్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సోమవారం సుదీర్ఘంగా జరిగిన రాష్ట్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
మూడు ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 1500 మంది ఉద్యోగులకువిఆర్‌ఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. రెవిన్యూ, పంచాయతీసర్వీసులను విలీనం చేయాలని, గ్రామ కార్యదర్శులను నియమించి పంచాయతీలే మూలంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సంకల్పించింది. రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలుః
- గ్రామస్థాయి పరిపాలనలో సమూల మార్పులు
- గ్రామస్థాయిలో సచివాలయం ఏర్పాటు, గ్రామ కార్యదర్శిగా ఓ అధికారి నియామకం.
- పోలీసులపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు ప్రజా ఫిర్యాదుల అధారిటీ ఏర్పాటు.
- ఇకపై ఏడాదికి రెండు సార్లు మాత్రమే జన్మభూమి కార్యక్రమం
- జన్మభూమిలో నోడల్ అధికారుల జోరు తగ్గించి ప్రజాప్రతినిధులకు భాగస్వామ్యం పెంపు.
- వ్యవసాయ అవసరాలకు విధిగా కనీసం 9గంటల విద్యుత సరఫరా.
- వెయ్యి గజాల స్థలం వుంటేనే అపార్ట్ మెంట్ నిర్మాణానికి అనుమతి.
- పేదలకు దగ్గరయ్యే పథకాలను అమలు చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు ఆమోదముద్ర
- ఎపిఐడిసి, ఎపిఎస్‌ఎఫ్ సి, ఎస్.టి.సి ల్లో 1500 మంది ఉద్యోగులకు వి.ఆర్.ఎస్.












Click it and Unblock the Notifications