హంపిి, హరికి చంద్రబాబు సత్కారం
హైదరాబాద్‌ః ప్రపంచస్థాయి పోటీలకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ లో క్రీడా సౌకర్యాలను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తెలుగువారి సామర్ధ్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ప్రపంచ గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ, మహిళా గ్రాండ్ మాస్టర్ హంపిలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఘనంగా సన్మానించింది. లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరినీ ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హరికృష్ణ, హంపి చదరంగంలో ఎంతో ప్రతిభ కనబరచి భారత దేశానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ఎనలేని కీర్తి సంపాదించిపెట్టారని ప్రశంసించారు. హరికృష్ణ, హంపికి భాగ్యనగరంలో చెరి 500 గజాల స్థలం కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అదే విధంగా హరికృష్ణకు 25 లక్షల నగదు పురస్కారం, హంపికి 35 లక్షల నగదు పురస్కారాన్ని చంద్రబాబు ప్రకటించారు. హంపి తండ్రి, ఆమె కోట్‌అయిన కోనేరు అశోక్ కు ప్రోత్సాహకంగా 5 లక్షల పురస్కారాన్ని చంద్రబాబు సభాముఖంగాఅందజేశారు.
ఇకమీదట హరికృష్ణ, హంపి వివిధ పోటీలలో పాల్గొనేందుకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు ప్రకటించారు.సైబరాబాద్ సమీపంలోని గచ్చిబౌలిలో 150కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల మంది ప్రేక్షకులు పాల్గొనేందుకువీలుగా బ్రహ్మాండమైన స్టేడియం నిర్మిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. హంపి, హరికృష్ణ తల్లిదండ్రులను కూడా చంద్రబాబు సత్కరించారు. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి తమ్మినేనిసీతారాం తదితరులు కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications