ఇండియాలో తోషిబా సాఫ్ట్‌వేర్‌సెంటర్
ముంబాయిః జపాన్‌కు చెందిన భారీ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి సంస్థ తోషిబా కార్పొరేషన్ భారత్‌లో పూర్తిస్థాయి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదనతో వుంది. ఈ అనుబంధం సంస్థ భారత్‌లో తోషిబా కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను కూడా చేపడుతుంది.
ఈ కొత్త కేంద్రం వల్ల విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీతో తమకు సాఫ్ట్‌వేర్ ఔట్‌సోర్సింగ్‌కు వున్న టైఅప్‌లో ఏమాత్రం మార్పు వుండదని తోషిబా వర్గాలు స్పష్టం చేశాయి. ప్రత్యేకంగా తోషిబా కోసం హెచ్‌సిఎల్ ఆఫ్‌షోర్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసింది.
తమ కొత్త కేంద్రం స్థానిక సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పొత్తుపెట్టుకుని సాఫ్ట్‌వేర్ రంగంలో రీసెర్చ్‌కు ప్రాధాన్యతనిస్తుందని తోషిబా వర్గాలు చెప్పాయి. తోషిబా కార్పొరేషన్‌కు ఇండియాలో రెండు విద్యుత్ సంస్థలు వున్నాయి.












Click it and Unblock the Notifications