ఆలయభూములస్వాధీనానికి కసరత్తు
హైదరాబాద్‌ః అన్యాక్రాంతం అయిన దేవాలయ భూములను స్వాధీనం చేసుకొనేందుకు త్వరలో ఓ ప్రణాళిక రూపొందించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి దండుశివరామ రాజు ప్రకటించారు. ఈ విషయంపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.
జంటనగరాలలో దేవాలయాల ఆస్తులను మంగళవారం నాడు ఆయన తనిఖీ చేశారు. కోట్లాది రూపాయలవిలువైన దేవాలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయని,వీటిని చట్టం ప్రకారం తిరిగి దక్కించుకొనే లక్ష్యంతోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు.
అయితే దేవాలయాల భూముల్లో ఇళ్ళుకట్టుకొని దశాబ్దాలుగా నివాసం వుంటున్న ప్రజలు మంత్రికి నిరసన తెలిపారు. చాలా ఏళ్ళుగా తాము ఇక్కడ వుంటున్నామని, ప్రభుత్వం తమకు పట్టాలు కూడా ఇచ్చిందని వారి మంత్రికి నివేదించారు.మీ ఆస్తులను సొంతం చేసుకోవడం ప్రభుత్వ లక్ష్యం కాదని, దేవుడి భూములు సక్రమంగా వున్నాయా లేక ఎవరైనా ఆక్రమించుకున్నారా అనే దానిపైనే తనిఖీ నిర్వహిస్తున్నట్లు మంత్రి వారికి సర్ది చెప్పారు.మీ భూములలో అంగుళం కూడా ప్రభుత్వానికి వద్దని శివరామరాజు చెప్పారు.












Click it and Unblock the Notifications