ఉపఎన్నికల పోలింగ్‌కు అంతా సిద్ధం
హైదరాబాద్‌ః అధికార ప్రతిపక్ష పార్టీలుఅత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునిపోరాడుతున్న మెదక్ జిల్లా సిద్దిపేట, కృష్ణాజిల్లా ఉయ్యూరు అసెంబ్లీ ఉపఎన్నికల పోలింగ్‌గురువారం నాడు జరుగుతున్నది. ఈ రెండునియోజకవర్గాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలనుఉపయోగిస్తున్నారు. ఉయ్యూరులో తెలుగుదేశంప్రధానంగా సానుభూతి ఓట్లపై ఆధారపడి విజయాన్నిఆశిస్తున్నది.
సిద్దిపేటలో మాత్రం అధికారపార్టీకి పరిస్థితి గడ్డుగానే వున్నది. ఉయ్యూరులోసైతం చివరి నిమిషంలో పోలీసు ఉన్నతాధికారుల్లోజరిగిన మార్పుపై కాంగ్రెస్ అనేక అనుమానాలువ్యక్తం చేస్తున్నది. అధికార దుర్వనియోగానికితెలుగుదేశం పాల్పడే అవకాశం వున్నదనికాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. సిద్దిపేటలోకూడా తెలుగుదేశం నేతలు పెద్దఎత్తునమొహరించినప్పటికీ పరిస్థితిమాత్రం తెలంగాణా రాష్ట్ర సమితి నేత చంద్రశేఖర్‌రావుకుఅనుకూలంగా వుంది. నియోజకవర్గంతోచిరకాలంగా వున్న పరిచయం, తెలంగాణా విషయంలోప్రజల్లో బలంగా వున్న సెంటిమెంట్ వల్లతన విజయం అనాయసం అని ఆయన అంటున్నారు.












Click it and Unblock the Notifications