చెనాకు లాడెన్ అప్పగింతకు సమ్మతి?
ఇస్లామాబాద్: అమెరికాలోని దాడుల కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఒసామాబిన్ లాడెన్‌ను నేరుగా అమెరికాకు గానీ, ఏ ఐరోపా దేశానికి గానీ అప్పగించకూడదనిఅఎn్ఘానిస్థాన్ మత గురువుల మండలి షురా అనుకుంటోంది.
లాడెన్‌ను చైనాకు అప్పగించే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని తాలిబాన్ అధినేత ముల్లా మహమ్మద్ ఒమర్ పాకిస్థాన్ ఇంటర్‌సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్‌ఐ) ఛీఫ్ జనరల్ మహమూద్ అహ్మద్‌తో చెప్పినట్లు తెలుస్తోంది.
చైనా ప్యతేక దూత ఒకరు పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్‌ను మంగళవారంనాడు కలిశారు. ఈ చైనా కోణం గురించి పాకిస్థాన్ నేతలు మంగళవారంనాడు విస్తృతంగా చర్చించారు. ఒకటి రెండు రోజుల్లో పాకిస్థాన్ ప్రతినిధి బృందంఅఎn్ఘానిస్తాన్‌ను సందర్శించి పాకిస్థాన్ ప్రతిస్పందనను తెలియజేస్తుందని భావిస్తున్నారు.
మంగళవారం రాత్రి 846 మంది ఉలేమాలు కాబూల్ చేరుకున్నారు. ఉలేమాల సమావేశం బుధవారంనాడు జరుగుతోంది.
ఇదిలా వుంటే, లాడెన్ అప్పగింతకు ఒత్తిడి తెచ్చేందుకు వెళ్లిన పాకిస్థాన్ బృందం తిరిగి వచ్చింది.అఎn్ఘానిస్థాన్‌కు తాము ఆయుధాలు, నిధులు సమకూరుస్తున్నట్లు అమెరికా చేసిన ప్రకటనను పాకిస్థాన్ ఖండించింది. తాలిబాన్లకు ఆయుధాలు, నిధులు ఎలాఅందుతున్నాయో అమెరికా ప్రత్యక్షంగా తేల్చుకోవడం మంచిదని పాకిస్థాన్‌అంటోంది.












Click it and Unblock the Notifications