తెలంగాణపై ఎఐసిసిలో కదలిక
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై ఎట్టకేలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఎఐసిసి)లో కదలిక వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌ను తాము పరిగణనలోకి తీసుకుంటామని ఎఐసిసి పరిశీలకుడు దల్జీత్ సింగ్‌విలేకరులతో చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు తెలంగాణ ఎమ్యెల్యేల ఫోరమ్‌ను ఏర్పాటు చేసినవిషయం తమకు తెలుసునని ఆయన చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు అసంతృప్తితో వున్నారని, వారు ప్రత్యేక రాష్ట్రాన్నికోరుకుంటున్నారని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై అధ్యయన చేయడానికి నియమించిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్‌పై పరిశీలన జరుపుతోందని ఆయన చెప్పారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలియజేయాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యులు చాలా కాలంగా ఎఐసిసిని కోరుతూ వస్తున్నారు. పలు మార్లు ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వినతిపత్రాలు సమర్పించారు. ఆమెతో చర్చలు కూడా జరిపారు. ఈలోగా తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ్యుల ఫోరమ్ ఏర్పాటు చేసుకున్నారు. ఎఐసిసిని ఒప్పించేందుకువీరు ప్రయత్నాలు చేస్తుండగానే కె. చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు బిజెపి పార్లమెంటు సభ్యుడు నరేంద్ర నాయకత్వంలో తెలంగాణ సాధన సమితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications