రైల్లో బాంబు-వందమందికి గాయాలు
న్యూఢిల్లీః న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళుతున్న నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ లో మంగళవారం రాత్రి బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం వంద మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 40 మంది పరిస్థితి ఆందోళనకరంగా వుంది. ఎన్.డి.ఎఫ్.బి. మిలిటెంట్లు ఈ ఘాతుకానికా పాల్పడ్డారు. రైలు ఆస్సాంలోని బొంగాయ్ గాం జిల్లాలోకి వచ్చే సరికి పేలుడు సంభవించింది.
పేలుడు తీవ్రతకు పార్శిల్ వ్యాన్ తో పాటు ఏడుబోగీలు పట్టాలు తప్పాయి. రెండు బోగీల్లో మంటలు చెలరేగాయి.మిలిటెంట్లు రైల్వే ట్రాక్ పై బాంబులు వుంచినట్లు అధికారులు చెప్పారు. గాయపడిన వారందరినీ బిజ్నీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.












Click it and Unblock the Notifications