అఎn్గాన్‌ ప్రజలకు బుష్‌ పిలుపు

న్యూయార్క్‌ః తాలిబన్‌ ప్రభుత్వాన్ని గద్దెదింపడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా ఆ దిశగా పావులను కదపడంలో నిమగ్నమైంది. తాలిబన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాల్సిందిగా అఎn్గాన్‌ ప్రజలకు అమెరికా నేత జార్జ్‌ బుష్‌ పిలుపునిచ్చారు.

తాలిబన్‌ సర్కారు కారణంగానేఅఎ్గాన్‌ ప్రజలు అనేక ఇక్కట్లకు గురవుతున్నారని ఆయనపేర్కొన్నారు. స్వేచ్ఛను కోల్పోవడం మాత్రమే కాక కరవు కాటకాలతో అల్లాడుతున్నారని పరదేశాల నుంచి తగిన సాయంఅందక చితికిపోతున్నారని బుష్‌ పేర్కొన్నారు.

మరో వైపు సరిహద్దుల ఆవల కమ్ముకున్న యుద్ధమేఘాలను ఊతంగా తీసుకుని తాలిబన్‌ సర్కార్‌ను దెబ్బతీసేందుకు ఉరకలు వేస్తున్న నార్తర్న్‌ అలయెన్స్‌కు కూడా అమెరికా బాసటను ప్రకటించింది. నార్తర్న్‌ అలయెన్స్‌కు అన్ని విధాల సాయ సహకారాలుఅందించాల్సిందిగా రష్యా వంటి మిత్రదేశాలను అమెరికా కోరింది. గతంలో రష్యా అండ వున్న నార్తర్న్‌ అలయెన్స్‌ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికానే తాలిబన్లనుపెంచిపోషించిన విషయం విదితమే. ఒక్క ఒసామాబిన్‌ లాడెన్‌ కోసం కష్టాలు కొని తెచ్చుకోవద్దనిఅఎn్గాన్‌ ప్రజలకు బుష్‌ సూచించారు. టెర్రరిస్టు చర్యలకు పాల్పడటం ఎంత నేరమో టెర్రరిస్టులకు అండగా నిలవడం వారికి ఆశ్రయం ఇవ్వడం కూడా అంతే నేరమని ఆయన స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+