భారత్, అమెరికామిలటరీ సంబంధాల పెంపు
న్యూఢిల్లీ: ఆంక్షల ఎత్తివేత అనంతర దశలో భారతదేశంతో అమెరికామిలటరీ సంబంధాలను మరింత పెంచుకోవాలనుకుంటోందని అమెరికా దౌత్యవేత్త రాబర్ట్ డి. బ్లాక్‌విల్ చెప్పారు. ఈ సంబంధాలను మరింతగా విస్తృతం, గాఢతరం చేసుకోవాలనుకుంటున్నామని ఆయన బుధవారంవిలేకరులతో చెప్పారు.
పోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం నిల్చిపోయినమిలటరీ విక్రయాల గురించి ఉభయ దేశాల మధ్య చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. వచ్చే వారంలో అమెరికా సందర్శించే భారత విదేశాంగ, రక్షణ శాఖల మంత్రి జస్వంత్ సింగ్ అమెరికా విదేశాంగ మంత్రి కోలిన్ పావెల్‌తో, రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్‌పెల్డ్‌తో సమావేశమవుతారు.
ఆస్తుల జప్తు చేయాల్సిన ఉగ్రవాద గ్రూప్‌లలో పాకిస్థాన్ ప్రేరేపిత లష్కర్-ఎ- తోయిబాను, జైష్-ఎ-మహమ్మద్‌లను చేర్చాలని భారత్ చేసినవిన్నపాన్ని ప్రస్తావించగా మొదటి జాబితా మాత్రమే వచ్చిందని, నిస్సందేహంగా ఆ జాబితా పెరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications