జిహాద్‌కు కాశ్మీరీ గ్రూప్‌ల ప్రతిజ్ఞ
ఇస్లామాబాద్:అఎn్ఘానిస్థాన్‌పై దాడి చేస్తే అమెరికాపై జిహాద్ (పవిత్ర యుద్ధం) చేయాలని పాకిస్థాన్‌లోని కాశ్మీరీ తీవ్రవాద గ్రూప్‌లు ఎనిమిది ప్రతిజ్ఞ చేశాయి. ఈవిషయాన్ని ఒక ఆన్‌లైన్ న్యూస్ ఏజెన్సీ రాసింది. తాలిబాన్, ముస్లింల చేతుల్లో అమెరికా ఓటమి చవి చూడక తప్పదని ఇక్కడ జరిగిన ఒక సమావేశంలో కాశ్మీరీ గ్రూప్‌లు అన్నాయి.
మిలటరీలో గానీ, దేశీయంగా గానీ అమెరికా తయారీ వస్తువులను వాడబోమని లష్కర్-ఎ-తోయిబా, హిజ్‌బుల్ ముజాహిదీన్, తహ్రీకుల్ ముజాహిదీన్, హర్కత్- ఉల్- ముజాహిదీన్, ఆల్‌బద్ర్ ముజాహిదీన్, హిజ్బ్- ఎ- ఇస్లామీ, హర్కతుల్‌జిహాద్ ఇస్లామీ, జమాతుల్ ముజాహిదీన్ చెప్పాయి.
లోయ స్వాతంత్ర్యం సాధించే వరకు కాశ్మీర్‌లోజిహాద్ కొనసాగుతుందని ఆ గ్రూప్‌లు అన్నాయి. ఇందులో అయోమయం అవసరం లేదని, రెండు వైపులా పోరాటం సాగుతుందని ఆ గ్రూప్‌లు అన్నాయి. అమెరికా బలగాలను ఎదుర్కోవడానికి ఆఎn్ఘానిస్థాన్‌కు ముజాహిదీన్‌లను పంపనున్నట్లు ఈ తీవ్రవాద గ్రూప్‌లు తెలిపాయి. ఇస్లామ్‌కు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వవద్దని ఈ ముజాహిదీన్ గ్రూప్‌లు పాకిస్థాన్‌నుకోరాయి.












Click it and Unblock the Notifications