అమెరికా, పాక్‌ల మధ్య విభేదాలు
ఇస్లామాబాద్:అఎn్ఘానిస్థాన్‌పై సైనిక చర్యకు దిగే విషయంలో పాకిస్థాన్, అమెరికాల మధ్య విభేదాలు తలెత్తిన సూచనలు కనిపిస్తున్నాయి.అఎn్ఘానిస్థాన్‌లో తాలిబాన్ ప్రభుత్వాన్ని కూల్చి మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను పాకిస్థాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.అఎn్ఘానిస్థాన్‌లోని నార్తర్న్ అలయెన్స్‌కు అమెరికా మిలటరీ సహాయంఅందించడంపై, పాకిస్థాన్‌లోని మత, జిహాదీ గ్రూప్‌లపై కూడా అమెరికా చర్యకు ఉపక్రమిస్తాననడంపై ఉభయ దేశాల అధికారుల మధ్య విభేదాలు పొడసూపినట్లు ది న్యూస్ రాసింది.
ఐక్య రాజ్య సమితి నుంచి తాజాగా అనుమతి తీసుకోవడానికి అమెరికా విముఖత ప్రదర్శించడం,అఎn్ఘానిస్థాన్‌పై పోరు సలిపే సైనిక కూటమిలో ముస్లిం దేశాలు లేకపోవడం వంటి కారణాలు కూడా సమస్యలు సృష్టిస్తున్నాయని ఆ పత్రిక రాసింది.
పంజ్‌షీర్ లోయలోని అజ్ఞాత స్థావరాల నుంచి నార్తర్న్ అలయెన్స్ బయటకు వచ్చి కాబూల్‌లోని అధికారపీఠం వైపు దూసుకెళ్లేందుకు సహకరించేసైనిక చర్యను పాకిస్థాన్ సైన్యం బలపరచడం జరగని పని అని ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించినట్లు ది న్యూస్ రాసింది.
తాలిబాన్‌తో తమ దౌత్య సంబంధాలు కొనసాగుతాయని, నార్తర్న్ అలయెన్స్‌ను బలపరిచేందుకు సహాయం చేయబోమని పాకిస్థాన్ అధ్యక్షుడుపర్వేజ్ ముషారఫ్, విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్ సత్తార్ మంగళవారంనాడే స్పష్టం చేశారు.అఎn్ఘాన్ గ్రూప్‌లను బలపరచడానికి బదులు అమెరికాఅఎn్ఘానిస్థాన్‌లోని శిక్షణా శిబిరాలపై సైనిక చర్యకు దిగాలని పాకిస్థాన్ కోరుకుంటున్నట్లు ది న్యూస్ రాసింది.
ఆర్థిక లావాదేవీల స్తంభనకు లక్ష్యంగా ఎంచుకున్న 26 సంస్థల్లో పాకిస్థాన్‌కు చెందిన ఒకమిలిటెంట్ గ్రూప్, ఒక మతపరమైన ట్రస్టుపేర్లను అమెరికా చేర్చడం వల్ల కూడా ఉభయ దేశాల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆ పత్రిక రాసింది. కరాచీకి చెందిన ఆల్- రషీద్ ట్రస్టుకు, ముజఫరాబాద్‌కు చెందినమిలిటెంట్ గ్రూప్ హర్కత్- ఉల్- ముజాహిదీన్‌కు ఒసామాబిన్ లాడెన్ తీవ్రవాద వ్యవస్థతో సంబంధాలున్నాయని అమెరికా చెప్పింది.
పాకిస్థాన్‌కు చెందిన మిలిటెంట్ సంస్థలను అన్నింటినీ నిషేధించాలని అమెరికా సూచిస్తే కాశ్మీర్‌స్వాతంత్ర్య పోరాటానికి తీవ్ర విఘాతం కలుగుతుందని పాకిస్థాన్ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని ది న్యూస్ రాసింది.












Click it and Unblock the Notifications