పట్టుసడలి రెచ్చిపోతున్న తాలిబాన్లు
కాబూల్‌ః అఎn్గాన్‌లో అంతర్గత పోరాటం పతాక స్థాయికి చేరింది. తాలిబన్ల ప్రత్యర్ధి వర్గమైన నార్తర్న్ అలయెన్స్ బలగాలు ముందుకుపురోగమిస్తున్నాయి. తమ చేజారిన అనేక పట్టణాలను కైవసం చేసుకోవడంతోపాటు రాజధాని కాబూల్ సమీపానికి ఈ బలగాలు చేరుకున్నట్టుగా చెబుతున్నారు. నార్తర్న్ అలయెన్స్ దళాలకు బయటనుంచికూడా సహాయం అందుతున్నట్టుగా చెబుతున్నారు.
ఏ క్షణంలోనైనా అమెరికా దాడులు ప్రారంభించే ప్రమాదం వుండటం మరోవైపు నార్తర్న్ అలయెన్స్ భీకరంగా ముందుకు తోసుకువస్తుండంతో తాలిబన్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తాలిబన్ల నేత ముల్లా ఉమర్ అమెరికా ప్రజలకు ఒక లేఖరాశారు. అమెరికా ప్రభుత్వం స్వయంకృతం వల్లనే న్యూయార్క్ సంఘటన జరిగిందనిపేర్కొన్నారు.
అమెరికాపై దాడి చేసేంత సమర్ధత ఒసామాబిన్ లాడెన్‌కు లేదని,అకారణంగా, నిరాధారంగా లాడెన్ పేరుతో అఎn్గాన్‌పైకి అమెరికా తుపాకీ గురిపెట్టిందని ఆరోపించారు. అమెరికా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి తమ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సూచించారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి యుద్ధసన్నాహాలనువిరమింపజేయాలని కోరారు.












Click it and Unblock the Notifications