వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్‌ అమెరికా అదనపు సహాయం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరులో సహకరిస్తున్న పాకిస్థాన్‌కు కొత్తగా 500 మిలియన్‌ డాలర్ల సహాయం అందించాలని అమెరికా అధికార యంత్రాంగం కాంగ్రెస్‌ను అడిగేందుకు సిద్ధపడుతున్నది. ఇది వరకే అందించిన వంద మిలియన్‌ డాలర్ల సహాయానికి ఇది అదనం. ఈ వంద మిలియన్‌ డాలర్లలో సగం నగదు రూపంలో ఇప్పటికే విడుదల చేశారు. మరో సగం వచ్చే వారం అందజేస్తారు.

అరబ్‌, ముస్లిం దేశాలకు తన ఉగ్రవాద వ్యతిరేక చర్యలకు ఊతం కల్పించుకోవడానికి అమెరికా ఏ విధంగా సహాయం చేస్తుందో ఈ విషయం తెలియజేస్తోందని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది.
అదనంగా ఇచ్చే 500 మిలియన్‌ డాలర్లను పాకిస్థాన్‌ తన సరిహద్దుల భద్రతకు, విద్యకు, వైద్యానికి వాడుతుందని అమెరికా అంటోంది. ఇందులో భాగంగానే అమెరికా సూడాన్‌ దైత్య కార్యకలాపాలపై వున్న ఆంక్షలను ఎత్తివేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X