కరవుపై మంత్రివర్గం చర్చ
హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రి వర్గం సోమవారంనాడిక్కడ సమావేశమైంది. పనికి ఆహార పథకం అమలు తీరును ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. వచ్చేజూన్ వరకు పనికి ఆహార పథకాన్ని పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో ఖరారు చేస్తారు. పనికి ఆహార పథకం అమలు కోసం మరో ఆరు లక్షల టన్నుల బియ్యంఅందించాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి వర్గం ఒక తీర్మానం చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కేంద్ర మూడు లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రంఅందించింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల సంభవించనున్న లాభనష్టాలపై
కూడా మంత్రివర్గం చర్చిస్తుంది. విద్యుత్ సర్‌చార్జీ తగ్గింపుపై కూడా మంత్రివర్గం చర్చించే అవకాశాలున్నాయి. శాసనసభ వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత మొదటి సారి మంత్రివర్గం సమావేశమైంది.












Click it and Unblock the Notifications