ప్రపంచ దేశాలకు మళ్లీ హార్ముజ్ టెన్షన్..! ఇరాన్ సంచలన ప్రకటన..!

అమెరికా-ఇరాన్ డీల్ (US-Iran Deal)తో హార్ముజ్ జలసంధిపై ఆంక్షలు తొలగిపోయి అంతర్జాతీయంగా చమురు ధరలు దిగివస్తున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. శాంతి ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా-ఇరాన్ తిరిగి దాడులు, ప్రతిదాడులకు దిగడంతో పరిస్ధితి ఒక్కసారిగా మారిపోయింది. దీంతో పశ్చిమాసియా మరోసారి యుద్దం అంచున నిలబడింది. అంతే కాదు ప్రపంచ చమురు ధరలు తిరిగి ఎగబాకే పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ, వ్యూహాత్మకమైన హార్ముజ్ జలసంధి(Strait of Hormuz) పై ఇరాన్ నియంత్రణను సవాలు చేసే ఏ ప్రయత్నమైనా ఉద్రిక్తతలను పెంచుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఇవాళ హెచ్చరించారు. అమెరికా తమ దేశంపై తాజాగా జరిగిన దాడులకు ప్రతిగా గల్ఫ్ దేశాల్లోని యూఎస్ స్థావరాలపై దాడులకు దిగిన ఇరాన్.. హార్ముజ్ ను వ్యూహాత్మకంగా కట్టిడి చేయడం ద్వారా ఒత్తిడి పెంచే కార్యక్రమం ప్రారంభించింది. రాబోయే 30 రోజుల పాటు హార్ముజ్ జలసంధి పూర్తిగా ఇరాన్ నియంత్రణలోనే ఉంటుందని, ఎలాంటి జోక్యం లేదా ఏకపక్ష చర్య అయినా దానిని తిరిగి తెరవడాన్ని ఆలస్యం చేస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు.

Iran Asserts Total Control of Hormuz Strait for 30 Days FM Warns Any Challenge Will Escalate Tensions

అమెరికాతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం లోని లెబనాన్‌కు సంబంధించిన నిబంధనలతో సహా అన్ని నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి అమెరికాకు పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్ లెబనాన్‌పై తన వైమానిక దాడులను కొనసాగిస్తోందని బాగ్దాద్ పర్యటన సందర్భంగా అరాఘ్చి తెలిపారు. ఈ అవగాహన ఒప్పందాన్ని ఇజ్రాయెల్ కూడా అంగీకరించిందని ఆయన గుర్తుచేశారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న ప్రాంతాల నుండి వైదొలగాలని అమెరికా ఒత్తిడి తేవాలని కూడా అరాఘ్చి కోరారు. గల్ఫ్‌లో యుద్ధ స్థాయిని విస్తరించడాన్ని ఇరాక్ సమర్థించదని, ఇరాన్‌పై దాడులను వ్యతిరేకిస్తుందని ఇరాక్ విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్ ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+