కేతన్ హత్య సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసిన పోలీసులు.. లోహగఢ్ కోటకు సియా!

పుణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు పోలీసులు తీవ్ర స్థాయిలో కొనసాగిస్తున్నారు. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్‌ను కొండపై నుంచి కిందకు తోసి హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితురాలు సియా గోయల్‌ను నేడు పోలీసులు కోటకు తీసుకెళ్లి క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు.

లోహగఢ్ కోటలో కేతన్ అగర్వాల్ ను హత్య చేసిన సియా

హత్య జరిగిన రోజు ఏం జరిగింది, నిందితులు ఎలా ప్లాన్ చేశారు అనే విషయాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించుకున్నారు. 20ఏళ్ల సియా గోయల్‌కు కేతన్ అగర్వాల్‌తో వివాహం నిశ్చయమైంది. కానీ సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో తన ప్రియుడు 22ఏళ్ల చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను హత్య చేసేందుకు కుట్ర చేసింది. జూన్ 18న లోహగఢ్ కోటకు కేతన్‌ను తీసుకెళ్లి కొండపై నుంచి కిందకు తోసి హత్య చేశారు.

Pune murder in realtor Ketan Agarwal Murder Case Fianc e Siya Goyal Crime Scene Reconstruction

కోటలో సీన్ రీ కన్స్ట్రక్షన్

ఈ కేసులో సియా మరియు చేతన్‌ను అరెస్టు చేసిన పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. సీన్ రీక్రియేషన్ సమయంలో సియా గోయల్ కేతన్‌ను ఏ స్థలం నుంచి తోసేశారు, హత్యకు ముందు తర్వాత వారి కదలికలు ఎలా ఉన్నాయి అనే వివరాలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. భద్రతా కారణాలతో కోటలో పర్యాటకులను తాత్కాలికంగా అనుమతించకుండా ఈ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు.

పెళ్లి రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందన్న భయంతోనే హత్య

ఒక డమ్మీని ఉపయోగించి సంఘటనను పునర్నిర్మించారు. చేతన్ చౌదరి టికెట్ లేకుండానే కోటలోకి ఎలా ప్రవేశించాడన్న విషయంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సియా తల్లిదండ్రులు ప్రవీణ్, పూజ గోయల్ మరియు సోదరుడు సాహిల్‌ను కూడా 12 గంటల పాటు విచారించారు. పెళ్లి రద్దు చేసుకుంటే కుటుంబ పరువు పోతుందన్న భయంతోనే హత్య చేసినట్లు సియా వెల్లడించింది.

కేతన్ కుటుంబం కొవ్వొత్తుల ర్యాలీ

హత్య కుట్రలో ఇతర వ్యక్తుల పాత్ర ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కేతన్ కుటుంబం న్యాయం కోసం గహుంజే ప్రాంతంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రత్యక్ష సాక్షులందరూ ముందుకు రావాలని కోరారు.

హైదరాబాద్లో కేశినేని చిన్ని భూకబ్జాలపై సీఎం రేవంత్ కు కేశినేని నాని షాకింగ్ లేఖ!
హైదరాబాద్లో కేశినేని చిన్ని భూకబ్జాలపై సీఎం రేవంత్ కు కేశినేని నాని షాకింగ్ లేఖ!

హత్య ప్లానింగ్, డిజిటల్ ఆధారాలు, సాంకేతిక అంశాలపై లోతుగా దర్యాప్తు

హత్య జరిగిన రోజు కోట వద్ద చాలా మంది ఉన్నప్పటికీ వారు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పోలీసులు హత్య ప్లానింగ్, డిజిటల్ ఆధారాలు, సాంకేతిక అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు త్వరగా ముగించి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+