విమానాల భద్రత పరిశీలనకు కమిటీ
న్యూఢిల్లీ:విమానాలను నడుపుతున్న ప్రయివేట్ కంపెనీల పనితీరును అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపరితల రవాణా శాఖ మంత్రి సయ్యద్ షాన్‌వాజ్ సోమవారంవిలేకరులతో ఈ విషయం చెప్పారు.
ప్రయివేట్ విమానం కూలి కాంగ్రెస్ సీనియర్ నేత మాధవరావు మరణించిన నేపథ్యంలో, ఇటీవల జరిగిన కొన్నివిమాన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కమిటీ ఏర్పాటుకు సిద్ధపడింది. కమిటీ తీరుపైవివరాలు ఇవ్వడానికి మంత్రి నిరాకరించారు. ఈ కమిటీ ఆరు నెలల లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications