కరవు పరిస్థితిలో మార్పు లేదు
హైదరాబాద్‌ః గత నాలుగయిదు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఏమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రంలోని కరవు పరిస్థితిని చర్చించేందుకు సోమవారం నాడు సమావేశమైన రాష్ట్రమంత్రి వర్గం కరవు సహాయ పనుల అమలును సమీక్షించింది.
ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. పనికి ఆహారం కింద లక్షా ఏనభైవేలపైగా పనులను చేపట్టగా అందులో ఎనభైవేల పనులు పూర్తయినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.విద్యుత్ చార్జీలకు సంబంధించి కొన్ని రాయితీలను కల్పించాలని నిర్ణయించినట్టుగా ఆయన చెప్పారు.విద్యుత్ చౌర్యానికి విధిస్తున్న అపరాధ రుసుములు, సర్‌చార్జీలు అసాధారణ స్థాయిలో వుంటున్నయని ఫిర్యాదులు వస్తున్న కారణంగావీటిని తగ్గించాలని నిర్ణయించినట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు. అంటరానితనం నిర్మూలనకు జస్టిస్ పున్నయ్య కమిటి సమర్పించిన సిఫారుసులను కేబినెట్ ఆమోదించినట్టుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. జస్టిస్ పున్నయ్య కమిటీ సిఫారసులను సమగ్రంగా పరిశీలించి, విస్తృతంగా వున్న ఈసిఫారస్సులోంచి తక్షణమే అమలు చేయాల్సిన సిఫారసులతో కేబినెట్ సబ్‌కమిటి మరో నివేదిక తయారు చేసిందని ఈ నివేదికను నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి తేవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్‌లను ఆమోదించినట్టుగా కూడా ఆయన చెప్పారు.
ఇదిలా వుండగా ఉదయం మంత్రివర్గ సమావేశం ప్రారంభం కాగానే దివంగత నేతలు కోట్లవిజయభాస్కర్‌రెడ్డి, మాధవరావు సింధియా మృతికి సంతాపం ప్రకటించింది.












Click it and Unblock the Notifications